ఇటీవల విడుదలైన ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తాజాగా వివాదంపై సినీ నటి తమన్నా స్పందించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి తమన్నా మాట్లాడుతూ… ఆమెను ఓ నటిగా ఎవ్వరూ ఏమీ చేయలేరని స్పష్టం చేసారు. అయితే ఈ చిత్రం విషయంలో దర్శకుడు క్రిష్ కొన్ని విభేదాలతో మధ్యలో చిత్రాన్ని వదులుకోగా, ఈ కారణంగా కంగనకు క్రిష్ కు మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమన్నాను ఓ ఆంగ్ల మీడియా ‘మణికర్ణిక’ చిత్రంఫై స్పందించాల్సిందిగా కోరగా . దీనిపై తమన్నా ‘మణికర్ణిక సినిమా చాలా బాగుందని విన్నాను. “ఉరీ: ది సర్జికల్ స్ట్రయిక్స్” సినిమాను ప్రస్తావిస్తూ… త్వరలో ఈ రెండు సినిమాలు చూసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
క్రిష్‌కు నాకు మంచి అనుబంధం ఉందని, అయితే ఆయనతో కలిసి పనిచేయకపోయినప్పటికీ మేం ఒకే పరిశ్రమకు చెందిన వాళ్లమని చెప్పింది. కంగన మాత్రం నాకో నటిగా మాత్రమే తెలుసని, ఆమె నటించిన ఎన్నో సినిమాలు చూశాను. నటిగా ఆమెను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని చేప్పారు. కానీ, ఒక సినిమాని తెరకెక్కించడానికి చిత్రబృందానికి ఉండే కష్టం అంత ఇంత కాదని తెలిపింది. ‘మణికర్ణిక’ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది చాలా బాధాకరమని తెలిపారు. డైరెక్టర్ క్రిష్ చెప్పినట్లు అనవసర విషయాలను వదిలేసి సినిమాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని తమన్నా పేర్కొన్నారు.