ఇక అప్ డేట్లు ఉండవట..!

వ్యాపార రంగంలోకి ఒక కొత్త తరం ఫీచర్ వస్తుంది అంటే అందరి ఆసక్తి అటువైపే ఉంటుంది. అలాగే ఇప్పుడంతా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఫోన్ల యుగం నడుస్తుంది అని చెప్పక్కర్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం విండోస్ ఫోన్లను కూడా చాల మంది వినియోగదారులు వినియోగించేవారు. అయితే చాల మంది రొటీన్ కి బిన్నంగా కొత్త ఓఎస్ ఉన్న ఫోన్లను వాడి చేద్దామని వాడేవారు. కానీ కాల క్రమేణా విండోస్ వాడకం తగ్గుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టిన నోకియా ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్లను తయారుచేసేది.

కానీ..ఆండ్రాయిడ్ ఫోన్లకు ఉన్న గిరాకీ వీటికి ఉండేది కాదు పైగా కొన్ని కొత్త యాప్స్ తీసుకురావడంలో విఫలం చెందడంతో  ఈ ఫోన్లకు ఆధారం క్రమంగా తగ్గిపోయింది. ఫెయిల్యూర్ ఓఎస్ గా పేరు తెచ్చుకుంది. అక్కడక్కడా కొంతమంది వినియీగదారుల కోసం మైక్రోసాఫ్ట్ కొన్ని అప్ డేట్లను విడుదల చేస్తూ వచ్చింది.

అయితే తరువాతి కాలంలో మైక్రోసాఫ్ట్  విండోస్ ఓఎస్ ఉన్న ఫోన్లలో కొత్త ఫీచర్లను రూపొందించడం కూడా ఆపేసింది. తాజాగా ఇక మైక్రోసాఫ్ట్ ఎటువంటి అప్ డేట్లను నిలిపివేయాలని చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే విండోస్ 10 ఓఎస్ ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేయాలనీ, ఇక విండోస్ నుంచి ఎటువంటి అప్ డేట్లు ఉండవని స్పష్టంచేసింది.   

leave a reply