కుటుంబకథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఈసారి ఆయన ఓ భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. గీత ఆర్ట్స్ బ్యానర్లో తాను ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఓ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే.. ఈ సినిమాకి ‘కూచిపూడివారి వీధి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా కమల్ హాసన్, వెంకటేష్ కాంబినేషన్లో చేయబోతున్నట్లు తెలిపారు. ఆసక్తిర కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని అన్నారు. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
కాగా.. టి.చక్రి డైరెక్ట్ చేసిన ‘ఈనాడు’ సినిమాలో కమల్, వెంకటేశ్‌లు కనిపించి అభిమానుల్ని అలరించారు. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తారా..? ఈ సినిమా పట్టాలెక్కుతుందా..? చూడాలి. కమల్ ప్రస్తుతం ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వెంకీ ఇటీవల ‘f2’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. మరోపక్క ఆయన ప్రధాన పాత్రలో ‘వెంకీ మామ’ సినిమా తెరకెక్కుతోంది. మహేష్, వెంకటేష్ మల్టీస్టారర్‌గా ‘సీతమమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు’ సినిమాతో ఆయన మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘బ్రహ్మత్సవం’ సినిమా అభిమానుల్ని అలరించలేకపోయింది.