చదువుల తల్లి ‘సరస్వతీ దేవి’

ముఖ్యంగా హిందూ మతంలో చల్లని తల్లి, చదువుల తల్లి సరస్వతీ దేవీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తమ పిల్లలు చదువులో ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. సరస్వతి మాత త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ సతీమణి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.

అలా దేశంలోనే ప్రముఖమైన క్షేత్రాల్లో, అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది.. ‘శ్రీ సరస్వతీ దేవి’ శక్తి పీఠం. జమ్మూ కాశ్మీర్‌లో వెలసిన ఈ శక్తి పీఠం పూర్వం మత పరమైన దాడులకు గురి కాసాగింది. అంతే కాకుండా ప్రకృతి పరమైన వైపరీత్యాల కారణంగా కూడా ఇక్కడి ఆలయం క్రమేణా శిథిలం కావడం మొదలైంది. దాంతో శ్రీ ఆది శంకరాచార్యుల వారు, అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి.. ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకు వచ్చారు. ఆ విజ్ఞాన శక్తిని శృంగేరి శారదాంబలో నిక్షిప్తం చేశారు.

అప్పటి నుంచి కాశ్మీర్‌లోని సరస్వతి శక్తి పీఠాన్ని దర్శించాలనుకునే వారు, శృంగేరి శారదాంబను దర్శించడం జరుగుతూ వస్తోంది. ఇక్కడి అమ్మవారు భక్తుల పాలిట కామధేనువు. కల్ప వృక్షమై కోరిన వరాలను ప్రసాదిస్తోంది.

leave a reply