చరిత్ర సృష్టించడం…ఖాయమేనా

చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్ధమైంది. సిడ్నీ వేదికగా భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతన్న చివరి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.  రెండో రోజు ఆటలో భాగంగా 303/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన కోహ్లీసేన బాటింగ్ అదరగొట్టారు. భారీ ఇన్నింగ్స్ ను అందుకున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను  622/7 వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి రోజు సెంచరీ చేసిన వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా’193′  పరుగుల చేసి వెనుదిరిగి డబుల్‌ సెంచరీ కోల్పోయాడు.  హనుమ విహారి కూడా 45 వ్యక్తిగత స్కోరుతో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. జడేజా పెవిలియన్‌ బాట పట్టిన అనంతరం  విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రిలియా  బౌలర్లు నాథన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు , హేజిల్‌వుడ్‌ రెండు, మిచెల్‌ స్టార్క్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. అయితే ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ చేసిన రెండో భారీ స్కోరు ఇది. 2004లో సిడ్నీ స్టేడియంలోనే భారత్‌ 7 వికెట్ల నష్టానికి 705 పరుగులు చేసింది.

టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి కారణం చివర్లో పంత్‌, జడేజా జోడి చెలరేగి ఆడటమే. దీనితో టీమిండియా స్కోరు 600 పరుగులు దాటింది. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 204 పరుగులు భారీ స్కోర్ అందించారు.  జడేజా 114 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 81 పరుగులుతో మెరిశాడు. 189 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్‌తో 159 పరుగులు చేసి పంత్‌ అజేయంగా నిలిచాడు. అనంతరం రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రిలియా అట ముగిసే సమయానికి  10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

leave a reply