టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు

ఖమ్మం తెలుగుదేశం పార్టీ లోక్‌సభ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యం లో నామా నాగేశ్వరరావు తెరాస లో చేరితే పార్టీకి బలం చేకూరుతుందని టీ‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భావించారు. ఇంకా అభ్యర్థుల లిస్ట్ ని ఫైనల్ చేయని కారణంగా ఇక జాప్యం చేయొద్దని ఆయన భావించి నేరుగా నామా నాగేశ్వర రావు ఇంటికి బయలుదేరారు కేటీఆర్.. నామా ఇళ్లే వేధికగా నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షం లో తెరాస లో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్.

ఈ కార్యక్రమంలో నామా నాగేశ్వర రావు తో పాటు టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణ కుమారి, అమర్ నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్ బాబు టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తో పాలు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక ఆయన చేరిక తో ఆయనకి ఖమ్మం నుండి ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారు అయినట్టే.

leave a reply