ట్రెండింగ్‌ స్టైల్స్‌తో ఫంకీగా..

సంప్రదాయమనేది భారతదేశానికి పెట్టింది పేరు. చీర కట్టుతో, గుండ్రటి బొట్టుతో మగువల అందం మరింత రెట్టింపు అయ్యేది. కానీ.. ఇప్పటి యువత సంప్రదాయంతో పాటు ప్రెజెంట్‌ ట్రెండ్స్‌ను కూడా మిక్స్‌ చేసి వహ్వా అనిపిస్తున్నారు. ఎలాంటి బట్టలు మీదకైనా నప్పేలా ఫంకీ నగలు ఇప్పుడు మర్కెట్‌లో ఫుల్‌గా దొరుకోస్తున్నాయి. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న బంగారం, డైమెండ్స్‌ వాటికంటే ఈ చిన్నపాటి ఫంకీ నగలకే ఓటు వేస్తున్నారు మహిళలు. చెవిదిద్దుల నుంచి కాలి పట్టాల వరకూ ఎన్నో కొత్తగా దొరుకుతున్నాయి. ఇప్పుడు అలాంటివాటికే యువత ప్రాధాన్యమిస్తుంది.

బంగారం, ప్లాటినం, కుందన్‌, లక్క వంటి ఎన్ని రకాల నగలు మార్కెట్‌లో ఉన్నా.. ఇప్పుడు వెండి నగలదే హవా నడుస్తుంది. బొహీమియన్‌, ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌లో జంక్‌ జ్యూయలరీతో స్టైలిష్‌గా కనిపించేందుకే ప్రతిఒక్కరు ప్రాధాన్యం ఇస్తున్నారు. వెండి, ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌లో రూపొందించిన జుంకాలు, జ్యూతీలను రిప్డ్‌జీన్స్‌కు జతగా వేసుకోవచ్చు. అదేవిధంగా సిల్వర్‌ నెక్లెస్‌ను స్పాగెట్టీ డ్రెస్‌ మీదకు వేసుకోవచ్చు. దీనికి జతగా బ్లాక్‌హీల్స్‌ ఉండేలా చూసుకోవాలి. వెండి ఉంగరాలు, చంకీ బ్రేస్‌లెట్‌ జెగ్గింగ్‌లు, ఫ్లెయిర్డ్‌ ప్యాంట్‌ల మీదకు నప్పుతాయి. చాంద్‌బాలీలు కుర్తీ-లెగ్గింగ్స్‌ మీదకు ఎంచుకోవచ్చు. అయితే సిల్వర్‌ జ్యూయలరీని  మరీ అతిగా ఎంచుకుంటే ఇబ్బందే. స్టేట్‌మెంట్‌ పీస్‌లా ఏదైనా ఒకటే వేసుకోవడం మేలు అని చెబుతారు నిపుణులు.

పొడవాటి స్కర్ట్‌ లేదా లాంగ్‌గౌన్స్‌ను వేసుకునేటప్పుడు మెడలో ఏమీ వేసుకోకపోవడమే మంచిది. అలాగే.. చీరలు మీద వీటిని వేసుకుంటే ట్రెండీగా మెరిసిపోతారని చెప్పొచ్చు. అన్నివేళ్లకూ స్టేట్‌మెంట్‌ రింగ్స్‌, రకరకాల బ్రేస్‌లెట్స్‌లను కలగలిపి గాజుల్లా వేసుకుంటే చాలు. ఇక ఒక సన్నని బ్రాస్‌లెట్‌, మ్యాచింగ్‌ ఉంగరాలు రెండుమూడింటిని జీన్స్‌, కుర్తీల మీదకు వేసుకుంటే స్టైలిష్‌గా క్యూట్‌గా అందరినీ ఎట్రాక్ట్‌ చేయవచ్చు.

leave a reply