అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఉద్యోగరీత్యా ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన గోవర్ధన్‌రెడ్డి డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో మేనేజరుగా పనిచేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30గంటలకు స్టోర్‌లోకి చొరబడిన దుండగులు గోవర్ధన్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిపై కూడ కాల్పులు జరిపారు. ఈఘటనలో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని సమీపం లోని ఆసుపత్రిలో చేర్పించారు. కాల్పులకు తెగబడిన దుండగులను నల్లజాతీయులుగా గుర్తించారు.గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని ఫ్లోరిడాలోని శవాగారంలో భద్రపరిచారు.ఆయన మరణ వార్త విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గోవర్ధన్‌రెడ్డి భార్య,ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు.మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ వాసిపై అమెరికాలో కాల్పులు
Post navigation
Posted in: