ఇంత…అభిమానమే?

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్టైలుకే ప్రేక్షకులు ఫిదా అయిపోతారు.రజినీకాంత్‌ సినిమా విడుదల అవుతోందంటేనే అభిమానుల్లో సందడి నెలకొంటుంది ఆయనకు వివిధ దేశాలలో అభిమానులు ఉన్నారు. ఇక తమిళనాట ఆయనకున్న అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. అయితే  రజినీ సినిమా ‘పేట’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సందర్భంగా అభిమానుల సందడి పెరిగిపోయింది. తాజాగా  ఓ అభిమాని రజినీపై తన అభిమానాన్ని కొత్తగా చూపించాడు.

ఈ సందర్భంగా తమినాడులో ఒక జంట అంబసు, కమాచి అనే యువతీయువకులు రజినీపై తమ అభిమానాన్ని తమ పెళ్లి రూపంలో చూపించారు.. ‘పేట’ సినిమా విడుదల ముహూర్తమే మంచి ముహూర్తమని… ఈ ముహూర్తాన్నే శుభముహూర్తంగా భావించి, వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి వివాహం ఏ ఫంక్షన్ హాల్ లోనో, కల్యాణ మండపంలోనో, గుడిలోనే జరగలేదు.. వింతగా సినిమా థియేటర్‌లో చేసుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.  ఈ వివాహానికి సినిమా చూసేందుకు వచ్చిన రజినీ అభిమానులే అతిథులు. వివాహానంతరం అందరికీ భోజనాలు కూడా పెట్టారు.

leave a reply