రాజుల మధ్య నలిగిపోతున్న.. విజయనగర ‘దేశం’

‘విజయనగరం’ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి క్రమం..క్రమంగా క్షీణిస్తూ..వైకాపా బలాన్ని పెంచుతున్నారనే విమర్శ వస్తోంది. జిల్లాలో ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచి ఒకసారి మాత్రమే ఓడిపోయిన ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడుకు మంత్రి పదవి దక్కకుండా మాజీ కేంద్రమంత్రి, విజయనగరం ఎంపి పి.అశోక్ గజపతిరాజు అడ్డుపడ్డారు. ఆయన మాటను కాదనలేక, నారాయణస్వామినాయుడుకు మంత్రి పదవి ఇవ్వలేక ‘చంద్రబాబు’ నలిగిపోతున్నారు. ఇది ఇలా ఉంటే..బబ్బిలి నుంచి వైకాపా ఎమ్మెల్యేగా విజయంసాధించిన ‘సుజయకృష్ణరంగారావు’కు మంత్రి పదవి ఇప్పించారు ‘అశోక్’. విజయనగర రాజాగా పేరున్న ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా…బబ్బిలి రాజాగా పేరున్న ‘సుజయకృష్ణరంగారావు’ మంత్రి పదవి నిర్వహిస్తున్నారు.

ఇద్దరూ నిజాయితీపరులే. కానీ..నన్నంటుకోకు..నామైల కాకి అన్నట్లు ఏదీ భుజానవేసుకోరు. రాజకీయంగా ముందుకు వెళ్లలేరు. పదేళ్లుపాటు విజయనగరం జిల్లాల్లో నూటికి నూరుశాతం అధికారం చెలాయించిన మాజీ మంత్రి బత్ససత్యనారాయణ ఈ నాలుగున్నరేళ్ల నుంచి కూడా యాభైశాతం అధికారాన్ని చెలాయిస్తున్నారట. 2014 ఎన్నికల్లో బత్సపై విజయం సాధించిన ‘కిమిడి మృణాళిని’కి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆమె ఆరడుగులు ముందుకేస్తే.. అరవై అడుగులు తడబడ్డారనే విమర్శలు ఉన్నాయి.

అపార రాజకీయ అనుభవం ఉన్న ‘బత్స ‘గు ఢీ కొట్టాలంటే ‘బబ్బిలి’ రాజాలకు, కిమిడికి మంత్రి పదవి ఇస్తే సాధ్యం అవుతుందా..? అనేది ఇప్పటికీ చంద్రబాబు తెలుసుకోలేకపోతున్నారు. ఇద్దరు రాజాలపై ఆధారపడి..విజయనగరం బాధ్యతలను వారికి అప్పచెప్పారు “చంద్రబాబు’. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో టిడిపి పరిస్థితి ఎలా ఉందంటే…గతంలో గెలిచిన స్థానాల్లో సగమైనా దక్కుతాయా..? అనే అనుమానాలు టిడిపి నుంచే వ్యక్తం అవుతోంది. అప్పట్లో వైకాపా, టిడిపిల మధ్య మెజార్టీ నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీ జరగగా, మూడు, నాలుగు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరిగింది.

దీంతో త్రిముఖ పోటీ జరగడంతో..టిడిపికి కలసి వచ్చింది. ప్రస్తుత మెజార్టీ నియోజకవర్గాల్లో మళ్లీ ముఖాముఖి పోటీ ఉంటుందని భావించినా, ‘జనసేన’ ప్రభావం ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇప్పటికీ విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి హోదాలో ఏ మంత్రికైనా బత్స ఫోన్ చేస్తే పగులు వెంటనే జరిగిపోతాయి. అదే టిడిపి ఇద్దరు రాజాలు ఫోన్ చేసినా..అధికారులు చలించడం లేదు. అధికారులు కాలయాపన చేస్తూ..సమస్యలను పెంచిపోషిస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు మీడియా వర్గాలతో మాట్లాడుతూ ఏనుగు బతికినా పదివేలే..చచ్చినా పదివేలే..అనే సామెత వర్తిస్తుంది.

అధికారంలో ఉన్నా..లేకున్నా..’బత’ హడావుడి ఇంకా తగ్గలేదు. జిల్లాలో ‘బత్స’ను ఢీ కొట్టే మాస్ లీడర్ టిడిపి లేరన్నది నిజం. ఇద్దరు రాజాలు వారి నియోజకవర్గాల నుంచి విజయం సాధించడం ఖాయం. మిగతా నియోజకవర్గాల్లో టిడిపి నాయకులకు పట్టులేదు. స్థానిక పరిస్థితులను బట్టి విజయం సాధిస్తారు…బత్స పథకాలు పనిచేస్తే ఓడిపోతారు. అన్ని విషయాలు తెలిసిన ‘చంద్రబాబు’ దీనిపై కలుగ చేసుకోబోవడానికి కారణం..మాజీ కేంద్ర మంత్రి ‘అశోక్’ ఫీల్ అవుతాడనే భావనతో ‘చంద్రబాబు’ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అభిమానం చివరకు ఎన్ని కష్టాలకు కారణమవుతుందన్న సంగతిని ఆయన గుర్తించడం లేదు. గతంలో ‘బత్స’ పార్టీలో చేరతానని చెప్పినప్పుడు ఆయనను చేర్చుకున్నట్లయితే..పరిస్థితి వేరే రకంగా ఉండేదని అంటున్నారు. ఎన్నికల నాటికి..జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయో..చూడాల్సిందే.

leave a reply