శంకర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో 2.ఓ భారీ అంచనాలమీద నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా 5 రోజులకు ఇండియా మొత్తం మీద రూ. 150.81 కోట్ల రూపాయల పైగా షేర్ సాధించడం జరిగింది . సినిమాలో అక్షయ్ కుమార్ ,రజనీకాంత్ నటన గురించి చెప్పక్కర్లేదు.ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు.. తమిళ వెర్షన్ల కంటే హిందీ వెర్షన్ కు కలెక్షన్స్ బాగా వచ్చాయి .
కాకపొతే సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడం.. థియేట్రికల్ రైట్స్ ను దేశవ్యాప్తంగా దాదాపు రూ. 250కోట్ల రూపాయలకు పైగా అమ్మడంతో ఇప్పటివరకూ రికవర్ అయిన షేర్ 50% లోపే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 2.0 హక్కులను రూ.. 70+ కోట్ల రూపాయలు పైగా అమ్మడం జరిగింది ఐదు రోజులకు గానూ ఈ చిత్రం రూ. 35.010 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక తమిళ నాడులో దాదాపు రూ. 100 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం . ఇప్పటివరకూ తమిళ నాడులో రూ.35.12 కోట్ల షేర్ ను మాత్రం సాధించింది.
రేటింగ్:3.2/5