సీఐ మాధవ్ కి ఊరట.. నామినేషన్ కి సిద్ధం..!

జేసి దివాకర్ రెడ్డి కి సవాల్ విసిరి టి‌వి లోకి ఎక్కాడు సీఐ గోరంట్ల మాధవ్.. వార్తల్లో సామాజిక మాధ్యమాల్లో ఈయన వైరల్ అయ్యారు. ఇక ఆతరువాత ఈయనకి రాజకీయాలపై ఆసక్తి ఉందని జగన్ ను కలిశారు జగన్ సమక్షం లో పార్టీ లో చేరారు.. ఆపై జగన్ కి ఆయన బలాన్ని బలగాన్ని చూపి జగన్ ని మెప్పించి హిందూపూర్ ఎంపీ టికెట్ సంపాదించాడు. రాజకీయాల్లోకి రాగానే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు.. ఇక పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇక ఈ విషయం ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన రాజీనామా ని అంగీకరించలేదు.. ఎన్నికల నియమాల ప్రకారం ఆయన రాజీనామాని ప్రభుత్వం అంగీకరిస్తేనే నామినేషన్ వేయగలరాణి వార్త బయటకొచ్చింది ఇక వైసీపీ పార్టీ లో టెన్షన్ మొదలయ్యింది. దీంతో కొన్ని పెర్లని కూడా పరిశీలించారు.. అయితే తాజాగా ఎన్నికల కమిషన్ ఈయనకి ఊరట కలిగేలా ఆదేశం జారీ చేసింది. మాధవ్ నామినేషన్ ను స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని ట్రైబ్యునల్ ఆదేశించింది. వీఆర్ఎస్ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తును వెంటనే ఆమోదించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈయన గతేడాది డిసంబర్ 30 తారికునే రాజీనామా పత్రాలు ఆడించారని అప్పటినుండి ప్రభుత్వమే ఈయన విషయం పై జాప్యం చేసినదని కాబట్టి వెంటనే ఈయన వి‌ఆర్‌ఎస్ ని అమలు చేయాలని ఆదేశం ఇచ్చింది ఇక ఈయన నామినేషన్ కి సిద్ధం అవుతున్నారు. దీంతో హిందూపురం వైసీపీ శ్రేణుల్లో మళ్ళీ జోష్ పెరుగుతుంది.

leave a reply