సొట్ట బుగ్గలు ఉండటం ఎప్పటికీ ఓ ఎట్రాక్షనే! కానీ సొట్టబుగ్గలు పుట్టుకతో రావాల్సిందే కానీ మనంకావాలనుకుంటే వచ్చేవి కాదు. కానీ ప్రతిదానికీ ఓ ఉపాయం ఉన్నట్లే వీటికి కూడాఉందంటున్నారు కాస్మాలజిస్టులు. కొన్ని చిట్కాలు పాటిస్తే డింపుల్స్ మీ సొంతంఅవుతాయంటున్నారు. అవి ఎలా..? ఈ క్రింది టిప్స్ పాటించండి..
1. సెల్ఫీలు లాంటి ఫొటోలు తీసుకునేటప్పుడు టెంపరరీగా సొట్ట బుగ్గలు కావాలంటే ఓ పని చేయండి. వేలితో కానీ, పెన్సిల్‌తో కానీ బుగ్గ మీద ఓ అయిదు నిమిషాలు నొక్కి ఉంచితే బుగ్గలు టెంపరరీగా సొట్టపడతాయి.
2. రోజూ ఓ అరగంట పాటు బుగ్గల్ని వేలితో లేదా పెన్సిల్‌తో నొక్కి ఉంచితే పర్మనెంట్‌గా బుగ్గలు సొట్టబడతాయని చెబుతున్నారు. కానీ ఇదెంతవరకు వాస్తవమో తెలిసే అవకాశం లేదు.
3. సొట్టబుగ్గలకి అన్నింటికంటే ఎఫెక్టివ్ చిట్కా ఉంది. నవ్వేటప్పుడు కనుక మనస్ఫూర్తిగా విశాలంగా నవ్వితే… చాలామంది బుగ్గలు సొట్టపడతాయట.
4. మేకప్ వేసుకునేటప్పుడు ఓ చిన్న చిట్కా పాటించినా బుగ్గల మీద సొట్ట ఉన్నట్లు కనిపిస్తుంది. దానికోసం నవ్వేటప్పుడు మడత పడే చోట… మన స్కిన్ రంగు కంటే కాస్త తక్కవ రంగు ఫౌండేషన్‌ని గుండ్రంగా అప్లై చేయాలి.
5. బుగ్గ మీద piercing చేయడం వల్ల కూడా బుగ్గలు సొట్ట పడినట్లు కనిపిస్తాయి.
ఇవేవీ కాదంటారా! మీకు శాశ్వతంగా సొట్టబుగ్గలు ఉండి తీరాలంటారా! అయితే దానికి చిన్నపాటి కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది.