స్టైల్ మార్చి.. గాంధీ మార్గంలో..!

చింతమనేని పేరు చెప్పగానే మొదట గుర్తు వచ్చేది ఆయన దురుసు ప్రవర్తనే. కానీ, ఈ దెందులూరు ఎమ్మెల్యే ఈ సారి ఆయన తన కోపాన్ని తీవ్రంగా దిగమింగుకుని.. ఎవర్నీ దూషించకుండా వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు వైపు నుంచి ఆయన విజయవాడ వెళ్తున్న సమయంలో మంగళగిరి మండలం కాజా టోల్‌ గేట్‌ వద్ద సిబ్బంది ఆపేశారు. ఎమ్మెల్యే పాస్ ఉందని చెప్పినా.. కారుకు నెంబర్ ప్లేట్ లేదన్న కారణంగా టోల్ గేట్ సిబ్బంది.. కారును కదలనివ్వలేదు. ఎంత సేపు చెప్పినా వినకపోవడంతో.. చింతమనేని కారు అక్కడే వదిలివేసి బస్సులో వెళ్లిపోయారు.

ఎవరు ఎదిరించినా… చెప్పిన మాట వినకపోయినా… ముందుగా.. దండించే ప్రయత్నం చేస్తారు చింతమనేని. అయినా ఈ సారి మాత్రం.. ఆయన ఆ వివాదానికి చోటివ్వలేదు. నిజానికి చోట్ల గేట్ల వద్ద సిబ్బంది చూపించే అత్యుత్సాహానికి… తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. రాజకీయ పార్టీల నేతలు.. అనుచరులతో కలసి వస్తున్న సమయంలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. టోల్ గేట్లను బద్దలు కొట్టేసి.. సిబ్బందిని చితకొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ చింతమనేనికి.. అలాంటి ట్రాక్ రికార్డ్ చాలా ఉన్నప్పటికీ… మరో కొత్త వివాదం తెచ్చుకోవడం ఇష్టం లేక పెళ్లిపోయారు.

ఈ విషయం కలకలం రేపుడంతో.. టోల్ గేట్ సిబ్బంది వివరణ ఇచ్చుకున్నారు. వాహనంపై… నెంబర్ ప్లేట్ లేదని.. అందుకే పోనివ్వలేదని చెప్పుకొచ్చారు. చింతమనేనికి క్షమాపణ చెప్పారు. అయితే..అలా కారు వదలిసి వెళ్లిపోయారని.. ఆయనది దుందుకుడు ప్రవర్తన అంటూ.. జగన్ మీడియాలో వార్తలు వచ్చాయి. చింతమనేని ఏం చేసినా.. దురుసు ప్రవర్తనగా చూపించడానికి ఆ మీడియా ఉత్సాహ పడుతుంది కానీ.. అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయదన్న విమర్శలు చింతమనేని అనుచరుల నుంచి వినిపిస్తున్నాయి.

leave a reply