అక్కడ ఉంటే ధనలాభమట..!

సాధారణంగా ప్రతి ఒక్కరి శరీరంపై పుట్టుమచ్చలు వుంటూనే వుంటాయి. కొన్ని పుట్టుమచ్చలు స్పష్టంగా వుంటే.. మరికొన్ని పుట్టుమచ్చలు అస్పష్టంగా వుంటాయి. కొన్ని తేనెరంగులోను.. మరికొన్ని నల్లగాను కనిపిస్తుంటాయి. ఇక తెల్లనిరంగులో ఉన్నవారి వంటిపై పుట్టుమచ్చలు స్పష్టంగా కనిపిస్తే, కాస్త చామనఛాయగాను.. నల్లగాను ఉండేవారి శరీరంలో అవి కలిసిపోతూ వుంటాయి.

ప్రాచీనకాలం నుంచి వ్యక్తులను నిర్ధారించుకోవడంలో పుట్టుమచ్చలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వచ్చాయి. అలాగే శరీరంలోని వివిధ ప్రదేశాలలో గల పుట్టుమచ్చల వలన వివిధ ఫలితాలు ఉంటాయనే విశ్వాసం కూడా ఆనాటి నుంచీ వుంది. అయితే ఈ పుట్టుమచ్చల విషయాన్ని కొంతమంది విశ్వసిస్తుంటారు. మరికొంతమంది పెద్దగా పట్టించుకోరు. నమ్మకం వున్నవారు మాత్రమే ఈ పుట్టుమచ్చల విషయంలోను.. వాటి ఫలితాలను తెలుసుకోవడంలోను ఆసక్తి చూపుతుంటారు.

శిరస్సు నుంచి పాదాల వరకూ గల పుట్టుమచ్చలు.. అవి వున్న ప్రదేశాన్నిబట్టి.. పరిమాణాన్నిబట్టి.. స్పష్టతనుబట్టి ఫలితాలను చూపుతుంటాయి. కొన్ని పుట్టుమచ్చలు ఆశాజనకంగా అనిపిస్తే.. మరికొన్ని పుట్టుమచ్చలు నిరాశపరుస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో ముక్కుకి కుడివైపున గల పుట్టుమచ్చ ధనలాభాన్ని సూచిస్తుందని చెప్పబడుతోంది. ఏదో ఒక రూపంగా ధనం కలిసివచ్చే అవకాశం ఈ పుట్టుమచ్చ కలిగినవారికి ఉంటుంది. అందువలన ఈ పుట్టుమచ్చను అదృష్టానికీ ధనలాభానికి సూచనగా చెబుతుంటారు. మరి మీరూ ఒకసారి చెక్‌ చేసుకోండి అక్కడ పుట్టుమచ్చ ఉందో.. లేదో..

ఇక మంచి ఫలితాలను ఇచ్చే ప్రదేశంలో పుట్టుమచ్చలు లేనంత మాత్రాన మానసికంగా కుంగిపోవలసిన పనిలేదు. సూర్యకిరణాలు అన్ని ప్రదేశాల్లో సమానంగా పరచుకున్నట్టుగానే, భగవంతుడి అనుగ్రహం అందరినీ సదా కాపాడుతూ వుంటుంది. ఆయన కరుణాకటాక్షాల కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంటుంది.

leave a reply