అతనితో అంటే కుదరదేమో..!

అక్షయ్‌తో కలిసి నటించాలనుందని.. కానీ కుదిరేలా లేదని అంటున్నాడు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌. సల్మాన్‌, అమీర్‌, సైఫ్‌ ఇలా బాలీవుడ్‌లో టాప్‌ హీరోలతో కలిసి నటించిన షారుక్‌ ఇంతవరకు అక్షయ్‌ కుమార్‌తో మాత్రం కలిసి నటించలేదు. మంచి స్కిప్ట్ర్‌ దొరికితే అజయ్‌తో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ మధ్య చెప్పిన షారుక్‌ తాజాగా.. అక్షయ్‌ సినిమాపై స్పందించారు. అక్షయ్‌తో నటించాలనుందని కానీ.. అది అంత ఈజీగా కుదరదని షారూక్‌ అన్నాడు.

అక్షయ్‌ ఉదయాన్నే లేచి షూటింగ్‌లు పూర్తి చేసుకొని రాత్రి త్వరగా నిద్రపోతాడని.. కానీ తాను మాత్రం విరుద్ధమని షారూక్‌ చెప్పాడు. అక్షయ్‌ నిద్రపోయే సమయంలో తాను షూటింగ్‌లో ఉంటానని, అక్షయ్‌ నిద్రలేచే టైంకు నేను పడుకుంటానని అందుకే తామిద్దరం కలిసి నటించాలనుకున్నా కుదరదని షారుక్‌ సరదాగా చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలనుకుంటున్న అభిమానుల కోరిక ఇప్పట్లో తీరేలా లేదని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ ఇద్దరికి సెట్‌ అయ్యేలా ఏ డైరెక్టర్‌ అయినా స్టోరీని రాసే ప్రయత్నం చేస్తారేమో.. చూడాలి.

leave a reply