`ఎన్టీవోడు’.. సూపర్‌..!

కాలాన్ని గెలిచిన కారణజన్ముని కథ.. జనం కోసం జోలె పట్టిన రారాజు కథ… దృవతారని తారని దాటి దేవునిగా ఎదిగిన ఓ రైతు బిడ్డ కథ.. ఎలా ఉంటుందో అని ఎదురు చూసిన అభిమానులకు, తెలుగు ప్రజలకు నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా తన నటవిశ్వరూపం `ఎన్టీఆర్‌ కథానాయకుడు’ తో తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నాడనే చెప్పాలి.

ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మొదటి ఆఫ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. సావిత్రి `మహానటి’ రూపొందిన తరువాత ఎందరో మహనీయుల జీవితం ఆధారంగా చాలా బయోపిక్‌లు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే.. బయోపిక్‌లు నిజ జీవితంలా ఉండాలి కాని.. డైలాగ్స్‌ యాడ్‌ చేసే విధంగా ఉండకూడదని ఎన్నో కామెంట్స్‌ కూడా వస్తున్నాయి.

ఎవరెలా నటించారంటే..

ఈ సినిమాలోని పాత్రల గురించి చెప్పవలసి వస్తే.. ముఖ్యంగా బాలయ్య గురించే చెప్పాలి. తన కెరీర్‌లోనే బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌, బ్లాక్‌ బస్టర్‌గా ఈ సినిమా నిలవబోతుంది. ఫస్ట్‌ ఆఫ్‌లో యంగ్‌ ఎన్టీఆర్‌గా.. సెకండ్‌ ఆఫ్‌లో 60 ఏళ్ల ఎన్టీఆర్‌గా చాలా వేరియేషన్‌ చూపించారు. ఒక్కో సీన్‌లో నిజంగా ఎన్టీఆర్‌నే మళ్లీ వచ్చి నటించారా..! అన్నట్లుగా ఆ పాత్రంలో లీనమైపోయారు బాలయ్య. ఇంచుమించు ఎన్టీఆర్‌ పోలికలు ఉండటంతో 60ఏళ్ల గెటప్‌లో బాలయ్య జీవించారని అనుకోవచ్చు. తండ్రికి తగ్గ తనయుడిగా అద్భుతమైన నటనను కనబరిచారు.

ఇక.. హరికృష్ణగా కళ్యాణ్‌ రామ్, బసవతారకంగా విద్యాబాలన్‌, ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్‌, చంద్రబాబు పాత్రలో రానా అదిరిపోయేలా నటించారని చెప్పవచ్చు. రానా క్యారెక్టరైజేషన్‌ కరెక్ట్‌గా ఫిట్‌ అయింది. సావిత్రిగా నిత్యామీనన్‌ గెటప్‌ సూపర్‌గా ఉంది. శ్రీదేవి, జయసుధ, జయప్రద క్యారెక్టర్స్‌లో రకుల్‌, హన్సిక, పాయల్‌ రాజ్‌పుత్‌లు ఎంటర్‌టైన్‌ చేశారు. సాయిమాధవ్‌ బుర్రా రాసిన డైలాగ్స్‌ అన్నీ అదిరిపోయాయి. కీరవాణి అందించిన సంగీతం సినిమాకే మెయిల్‌ హైలెట్‌, ఇక సినిమాటోగ్రఫీ, క్రిష్‌ డైరెక్షన్‌ అన్నీ సినిమాకు ప్లస్‌ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌, బాలయ్య అభిమానులకు ఇదో కాంబో ఆఫర్‌ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్‌ గురించి చెప్పాలంటే ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందనుకోవడంలో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పుకోవచ్చు.

కథ:

1984లో మద్రాస్‌ పట్టణంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌తో మొదటిసీన్‌ స్టార్ట్‌ అవుతుంది. అక్కడి నుంచి ఎన్టీఆర్‌ లైఫ్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది అనే సీన్స్‌ వస్తాయి. విజయవాడలో రిజిస్ట్రార్‌గా ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్టీఆర్‌ జీవితం మొదలవుతుంది. అయితే.. అక్కడ లంచాలు తీసుకోవడం ఇష్టంలేక ఉద్యోగానికి రిజైన్‌ చేస్తారు నందమూరి తారక రామారావు.

సినిమా హీరో అవుతానని చెప్పి మద్రాస్‌ ప్రయాణమవుతారు. సినీ రంగంలో ఒక సంవత్సరం పాటు విపరీతమైన ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఆ తరువాత మెల్లగా అవకాశాలు దక్కించుకోని నిలబడతారు. నిదానంగా నిలదొక్కుకున్న తరువాత మొదటి సారిగా సినీ జీవితంలో కృష్ణుడి వేషం వేయాల్సి వస్తుంది. మాయాబజార్‌ సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్‌ ఎంత అద్భుతంగా నటించారో దానిని బాలయ్య కల్లకు కట్టినట్టు నేటి తరానికి చూపించారు. `ఎన్టీఆర్‌నే మళ్లీ వచ్చి నటించారా’ అన్నట్టు అంత అద్భుతంగా ఒదిగిపోయారు బాలయ్య. ఇక తెలుగు సినిమాల్లోనే క్లాసికల్‌గా నిలిచిపోయిన గుండమ్మకథ  సినిమాలోని ఒక సీన్‌ ఉంటుంది. ఈ సీన్‌లో ఎన్టీఆర్‌గా బాలయ్య, సావిత్రిగా నిత్యామీనన్‌ చేశారు. ఈ షూటింగ్‌ సమయంలోనే తన పెద్దకొడుకు రామకృష్ణ మరణించినట్లు తెలుస్తుంది. అయినా కూడా తన వల్ల నిర్మాతకు నష్టం కలిగించొద్దని ఆలోచించి, పాకప్‌ చెప్పకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తారు. ఈ ఒక్క సీన్‌తో ఎన్టీఆర్‌కి ఆయన వృత్తి పట్ల ఎంత అంకిత భావం ఉందో తెలుస్తుంది. దీంతో ఇంటర్‌వెల్‌ వస్తుంది.

మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి.. అదీ కూడా.. మనం పోయాకే అనే డైలాగ్‌తో.. సెకండ్‌ ఆఫ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఆ తరువాత ఎన్టీఆర్‌, ఏఎన్నారల మధ్య స్నేహాన్ని డైరెక్టర్‌ క్రిష్‌ చాలా బాగా చూపించారు. ఇక దానవీరశూరకర్ణ చిత్రంలో “చిత్రం భళారే విచిత్రం” పాటలో బాలకృష్ణ, శ్రియ మునిపోయారనే చెప్పవచ్చు. ఇక యమగోల, అడవిరాముడు పాటలతో బాలయ్య అదరగొట్టేశాడు.

ఎన్టీఆర్‌ జీవితంలో ఎత్తుకే ఎదిగారే తప్ప.. పల్లాలు లేని జీవితంగా ఆయన సినీ ప్రయాణం సాగింది.

పొలిటికల్‌ ఎంట్రీ..

ఇక ఆతరువాతే అసలు కథైన ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ స్టార్ట్‌ అవుతంది. ప్రజా సేవ పట్ల ఆయనకున్న ఐడియాలజీ ఏంటన్నది తెలుస్తుంది. ఈ క్రమంలో వైఎస్సార్, మాజీ సీఎం నాదేండ్ల, రామోజీరావు, చంద్రబాబు నాయుడు పాత్రలు ఎంటర్‌ అవుతాయి. చంద్రబాబు నాయుడుగా రానా గెటప్‌ సూపర్‌గా ఉంది. అయితే ఈ సినిమాలో మాత్రం కొద్దిసేపే కనిపించారు. ఇక అసలు కథ ఏంటన్నది సెకండ్‌ పార్ట్‌లోనే ఉంటుంది.

`తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నాం’ అన్న ఎన్టీఆర్‌ మాటతో సినిమా ఎండ్‌ అవుతుంది.

చివరగా.. మహానీయుడి జీవితంను గురించి ఒక మహానీయుడిగా జీవించి నిరూపించాడు నటుడు బాలకృష్ణ. ఎలాంటి మలుపుల్లేని కథగా ఆయన ప్రయాణం సాగింది.

leave a reply