అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు

పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.అమరుల త్యాగాలను జాతి గుర్తుంచుకుంటుందన్న చంద్రబాబు,జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

leave a reply