ఆఫీస్‌లకి ఏ డ్రస్‌ కలర్‌ బావుంటుంది..?

సాధారణంగా ఆఫీస్‌లకి కొంచెం డిగ్నీఫైడ్‌ దుస్తులనే ఎంపిక చేసుకుంటాం. అందులో చాలా మంది బ్లాక్‌ కలర్‌ ఎక్కువగా వేర్‌ చేస్తారు. డ్రెస్‌ స్టయిల్‌ మీ వ్యక్తిత్వాన్ని చెప్పినట్టే, వాటి రంగులు కూడా మీ మూడ్‌ను తెలియజేస్తాయి. ఆఫీస్‌ వాతావరణాన్ని ప్రభావితం కూడా చేస్తాయి. అందుకే పని ప్రదేశంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే దుస్తుల ఎంపికలో రంగుల పాత్ర కీలకం అనే విషయం మరిచిపోకండి.

మీరు ధరించిన దుస్తుల రంగుకు మీ సహోద్యోగుల మనఃస్థితిని ప్రభావితం చేసే శక్తి ఉంది. ఆఫీసుకు ఆకుపచ్చ రంగు దుస్తులు సరైన ఎంపిక. మీరు స్నేహపాత్రులనే సందేశం ఎదుటివారికి అందుతుంది. వాతావరణంలో ఆహ్లాదాన్ని నింపుతుంది. నీలం రంగు దుస్తులు పని ప్రదేశంలో ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని నింపుతాయి. జ్ఞానానికీ, పరిపక్వత కూ ప్రతీక గోధుమరంగు. ఈ రంగు దుస్తులు ధరిస్తే నలుగురిలో ప్రతిభావంతులుగా కనిపిస్తారు. అయితే వీటిని అరుదుగా ధరిస్తేనే అందం.

నలుపు అధికార దర్పానికి సూచిక. ఈ రంగు దుస్తులు అన్ని రకాల వేడుకలకు నప్పుతాయి. పరిపూర్ణ్వత్వాన్ని ప్రతిఫలించే రంగు తెలుపు. తెలుపు రంగు దుస్తులు ఆఫీస్‌కు చక్కగా సరిపోయే దుస్తులు. వీటికి తోడుగా నగలు ధరిస్తే అందం, ఠీవీ రెట్టింపవుతుంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు. ఎరుపు, నారింజ, గులాబీ రంగులు అసహనం, కోపానికి కారణమవుతాయి కాబట్టి ఇలాంటి రంగు దుస్తులు ఆఫీసుకు నప్పవు.

leave a reply