ఆ ‘మెగా’ అవకాశం ఎవరికో..!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కాగా.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ మెగా హీరో భాగం కానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం తన ఫ్యామిలీలోనే ఓ హీరోను నిర్మాత రామ్‌ చరణ్‌ తీసుకోవాలనుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ పాత్రను వేరే హీరోలతో చేయించడం కంటే తనవాళ్లకే ఛాన్స్‌ ఇస్తే బావుంటుందని చిరు, చెర్రీలు అనుకుంటున్నారట. మెగాస్టార్‌ మూవీలో ఒక చిన్న పాత్రలో అయినా చిరుతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవాలని ఎవరైనా ఎదురుచూస్తుంటారు.

కాగా.. మెగా హీరోలందరూ తమతమ షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బన్నీనే ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సైరాలో నటించే అవకాశం బన్నీకే ఎక్కువగా ఉన్నట్లు కొందరు అనుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ రెండు సినిమాలలో అతిథి పాత్రలు చేసిన బన్నీ ముచ్చటగా మూడోసారి మామ సినిమిలో కనిపించనున్నాడని టాక్. మరి ఈ అవకాశం బన్నీనే వరిస్తుందో లేక మరో మెగా హీరోకు దక్కుతుందో తెలుసుకోవాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

leave a reply