‘ఇదే బెస్ట్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌..కిల్‌ పైరసీ’

పైరసీలు ఈ మాట తెలియని ప్రేక్షకులు ఉండరు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఈ పైరసీలు అనే వాటికి చెక్‌ పెట్టలేకపోతున్నాయి చిత్ర పరిశ్రమలు. ఎంతో కష్టపడి సినిమాలు తీస్తే.. ఈ పైరసీ రాయుళ్లు ఇలా సినిమాలను పైరసీలు చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అని ఎంతో మంది నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పిన మాటలే.. అయినా మీ మాటలు మీవే.. మా చేతలు మావే అన్న చందంగా పైరసీ రాయుళ్లు తయారవుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో సినిమా ఫ్రీగా వచ్చేస్తుంది కదా.. అని ప్రేక్షకులు కూడా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.

అసలు విషయమేంటంటే.. బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌, యామి గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉరి: ది సర్జికల్‌ స్ట్రయిక్‌’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకుంది. అయితే ఈ సినిమా కూడా కొన్ని వెబ్‌సైట్లలో పైరసీకి గురైంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ‌ వెబ్‌సైట్‌ నుంచి ఉరిసినిమాను డౌన్‌లోడ్‌ చేశాడు. సినిమాను చూద్దామని ప్లే బటన్‌ నొక్కగానే చిత్రబృందం పెట్టిన ఓ వీడియో ప్రసారమైంది. ఆ వీడియోలో మాలాంటి భారతీయ సైనికులు శత్రుదేశంలోకి చొరబడి ఉగ్రవాదులను అంతం చేస్తున్నప్పుడు మీ పైరసీ వెబ్‌సైట్‌లోకి చొరబడలేమనుకుంటున్నారా? అని యామీ వీడియోలో చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

మొత్తానికి ఈ పైరసీ బాబులకు చెక్‌ పెట్టేందుకు ఉరి: ది సర్జికల్‌ స్ట్రయిక్‌చిత్రబృందం మంచి షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియో ఫుల్‌గా వైరల్‌ అవుతుంది. ఆ వీడియోని ఇండియన్‌ డిఫెన్స్‌ ఫేస్‌బుక్‌ అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియోపై హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు. ఇదే బెస్ట్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌.. కిల్‌ పైరసీ’.. అంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

leave a reply