ఇద్దరు లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్

కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించటంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నేపథ్యంలో టీడీపీ,వైసీపీ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమంటూ వచ్చిన జనసేన వామపక్షాలతో జతకట్టింది. ఈ సందర్బంలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి ఓఎన్జీసీ విశ్రాంత అధికారి డీఎంఆర్‌ శేఖర్‌, రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి ఆకుల సత్యనారాయణ పోటీ చేస్తారు అని తెలిపారు.

leave a reply