ఎన్టీఆర్ బయోపిక్..నా పూర్వజన్మ సుకృతం!

‘యన్‌.టి.ఆర్‌’ అంటే తెలియని తెలుగువారు ఉండరు. అంతటి గొప్ప వ్యక్తి జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “యన్‌.టి.ఆర్‌”.నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన సినిమా ట్రైలర్ వచ్చేసింది. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం యన్‌.టి.ఆర్‌ కుటుంబ సభ్యులతో పటు ఆత్మీయుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. చాలా ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా రొండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే మొదటి భాగంగా వచ్చే నెల జనవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు. రొండో భాగాన్ని ఫిబ్రవరి 7వ విడుదల చేయాలని భావిస్తున్నారు. మొదటి భాగానికి “కధానాయకుడు” అని పేరు ఖరారు చేయగా రొండో భాగానికి ” మహానాయకుడు” అనే పేరును పెట్టారు.

నిన్న జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో నేను నటిస్తానని ఎప్పుడు ఊహించలేదు. కానీ నేను ఈ సినిమాలో ఒక భాగం అయ్యాను అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించి పనిచేశాను. ఐశ్వర్యం – పేరు ప్రతిష్టలనేవి మన పూర్వజన్మ రుణాన్ని బట్టే వస్తుంది. ఎవరైనా నువ్వు ఎవరివి అని నన్ను అడిగితే భారతీయుడిని అంటాను. అదే ప్రశ్న మరోసారి అడిగితే తెలుగు వాడినని అంటాను. ఇంకోసారి అడిగితే నందమూరి తారక రామారావు కొడుకునని అంటాను. మళ్లీ అడిగితే ఓ అన్నగారి అభిమానిని అంటాను. ఆయనకు సాటిలేరు ఎవ్వరూ. ఆయనకొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఎన్టీఆర్ గా నటిస్తానని అనుకోలేదు అనిచెప్పుకొచ్చారు.

leave a reply