ఎఫ్2 (ఫన్ & ఫ్రస్ట్రేషన్)

ఎఫ్2:సంక్రాంతి అల్లుళ్ళ ట్యాగ్ తో కామెడీనే నమ్ముకుని వస్తున్న అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ ఎఫ్2 ఈ నెల 12 విడుదల కోసం ముస్తాబవుతోంది.ఈ చిత్రంలో తోడి అల్లుళ్ళు గా వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్నారు వెంకీకి జంటగా తమన్నా నటిస్తుండగా వరుణ్ కి జంటగా మెహరీన్ నటిస్తుంది. ప్రధాన పాత్రలలో ప్రకాష్ రాజ్ రాజేంద్రప్రసాద్ , బ్రహ్మాజీ, రఘుబాబు,ప్రియదర్శి , మిర్చి కిరణ్ తదితరులు నటిస్తున్నారు. ట్రైలర్ లేకుండా ఇప్పటిదాకా కేవలం ఆడియో ప్లస్ టీజర్ తోనే సరిపుచ్చారు. నిజానికి పోటీ పడుతున్న మూడు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లో కాస్త బజ్ తక్కువగా ఉన్నది ఎఫ్2కే. వెంకీకి గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు స్ట్రాంగ్ మార్కెట్ లేదు. అయినా ఇందులో కంటెంట్ మెప్పించాలి అంటే తనే మీద ఎక్కువ భారం ఉందన్న సంగతి తెలిసిందే. మరోవైపు అంతరిక్షం డిజాస్టర్ తో వరుణ్ తేజ్ కూడా షాక్ తిని ఉన్నాడు. అయితే స్క్రీన్ షేరింగ్ కాబట్టి తనకు దీని వల్ల ఒరిగేది ఏమి లేదు.

leave a reply