ఏం సెట్టయ్యిందో ఏమో కానీ..యూత్‌ ఫిదా..!

ఫ్రీక్‌ పిల్లా సాంగ్‌తో అందర్నీ ఫ్రీజ్‌ చేసిన మలయాళీ భామ ప్రియా వారియర్‌.. కన్నుగీటుతోనే కుర్రకారు మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఈమె నటించిన ‘ఒరు ఆధార్‌ లవ్‌’ సినిమా తెలుగులో ‘లవర్స్‌ డే’గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళం, తెలుగు రెండు వెర్షన్లలో కూడా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్‌ అవుతుందని నేను అనుకోలేదు..’ అంటూ ప్రియా వారియర్‌, రోషన్‌ల మధ్య సాగే రొమాంటిక్‌ సన్నివేశాన్ని టీజర్‌లో చూపించారు. ఇద్దరి నటన చూడటానికి చక్కగా అనిపించింది. షాన్‌ రెహమాన్‌ అందించిన మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది.

leave a reply