ఒత్తిడితో తస్మాత్..జాగ్రత్త!

లాస్‌ ఏంజెల్స్‌:పెరుగుతున్న టెక్నాలజీతో పాటు మానవుని జీవన విధానం కూడా మారుతుంది. మానవులు చేసేపనిలో ఒత్తిడికి గురిఅవడం, ఎక్కువగా ఆందోళన చెందడం జరుగుతుంది. ఇలా నిరాశకు గురయ్యే వారికి ఎక్కువగా  గుండెపోటు, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని  అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ధూమపానం, ఊబకాయం ఉన్నవారిలోనూ ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని  సూచించారు. ఆందోళన , ఒత్తిడి లేనివారితో పోలిస్తే ఆయా సమస్యలతో బాధపడుతున్న వారిలో గుండెజబ్బులు, గుండెపోటు వచ్చేప్రమాదం దాదాపు 60 %,  బీపీ వచ్చే చాన్స్‌ 55 %,  కీళ్లనొప్పులువచ్చే అవకాశం 80 % పైగావస్తున్నట్లు  గుర్తించారు.

leave a reply