కిల్‌బిల్‌ పాండే ఉక్కు మనిషి

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందాన్ని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం బ్రహ్మానందం బైపాస్‌ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కాగా.. బ్రహ్మానందం అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘‘బ్రహ్మానందం నిజమైన ఉక్కు మనిషి. ఆయన గుండె చాలా గట్టిది. ఫన్నీ అండ్ ఫియర్‌లెస్. మా కిల్ బిల్ పాండే.. గుండె వ్యాధిని చంపేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అంతేకాదు బ్రహ్మానందంతో దిగిన ఫొటోలను షేర్ చేశారు అల్లు అర్జున్. ఫన్నీగా కన్నుకొడుతూ బ్రహ్మానందం ఫొటోకు ఫోజులిచ్చారు. బన్నీ, బ్రహ్మానందం కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఆర్య 2’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసు గుర్రం’ వంటి ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలిసి చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

leave a reply