జగ్గూ భాయ్‌ & వీరారెడ్డి

జగ్గూభాయ్‌ అలియాస్‌ జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నుంచి మరో లుక్‌ను బయటకు రిలీజ్‌ చేశారు. సినిమాలోని వీరారెడ్డి పాత్ర ఫస్ట్‌ లుక్‌ను సైరా యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాలో జగపతి బాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఏ పాత్రనైనా జగ్గూభాయ్‌ ఇట్టే ఒదిగిపోతారు. ఇందులో కూడా మంచి పాత్రను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టర్‌లో జగ్గూ భాయ్‌ చాలా గంభీరంగా, ప్రశాంతంగా కనిపిస్తున్నారు. మరి సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నారో చూడాలి.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ‘ సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరెకెక్కుతుంది. ఇందులో మెగాస్టార్‌ నరసింహారెడ్డి పాత్రలో నటించగా, తనయుడు చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ యూనిట్‌ నుంచి అమితాబ్‌, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, ఇప్పుడు జగపతిబాబు పాత్రలకు సంబంధించిన లుక్స్‌ బయటకు వచ్చాయి. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.

leave a reply