‘ఝాన్సీ రాణి’గా విజయం సాధించిందా?

‘మణికర్ణిక’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన దగ్గరన్నుంచీ ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అయినా.. ఎటువంటి అవాంతరాలు లేకుండా సినిమా రీలీజ్‌ అయింది. విభిన్నమైన పాత్రలు చేయడంలో కంగనా రౌనౌత్‌ ముందుంటుంది.  ఆనాటి నిజానికి తార్కాణంగా ఝాన్సీరాణి లక్ష్మీబాయి జీవిత చరిత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అయితే.. నిజ జీవితాన్ని ఆధారంగానే సినిమాను తీసారా..? లేదా అన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మరి కంగనా రౌనౌత్‌ ఎలా నటించింది? ఈ చిత్రం ఎలా ఉంది? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే: బెనారస్‌లోని బితూర్‌లో పుట్టి పెరిగిన మణికర్ణికకు చిన్పటినుంచీ తల్లి లేని కారణంగా చాల అల్లరిపిల్లగా పెరుగుంది. అలాగే ఆమెకు కర్రసాము, గుర్రపుస్వారీ ఇలాంటి వాటి మీద ఆసక్తి ఎక్కువ. తన తండ్రి ఇలాంటివి ఇష్టం లేకపోయినా రహస్యంగా నేర్చుకుంటుంది మణికర్ణిక. మణికర్ణికకు పెళ్లి వయస్సు రాగానే ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్‌ రావుతో వివాహమవుతుంది. ఝాన్సీ రాజ్యానికి వెళ్లాక మణికర్ణికకు లక్ష్మీబాయిగా పేరు మారుస్తారు. దీంతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా రాజ్యంలోని ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకుంటుంది. రాజ్యానికి సరైన రాణి అని అందరూ ప్రశంసిస్తుంటారు. అదే సమయంలో భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ విస్తరిస్తుంటుంది. ఈ క్రమంలో ఝాన్సీ రాజ్యాన్ని వశం చేసుకునేందుకు బ్రిటీష్‌ పాలకులు చేసే ప్రయత్నాలను లక్ష్మీబాయి తిప్పికొడుతుంది. వారితో చర్చలకు నిరాకరిస్తుంది. దీంతో అహం దెబ్బతిన్న బ్రిటీష్‌ పాలకులు ఝాన్సీని ఎలాగైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఎత్తులు వేస్తారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఝాన్సీ స్వాతంత్ర్యం కోసం లక్ష్మీబాయి ఏ విధంగా పోరాడింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్‌ ఒదిగిపోయిందనే చెప్పాలి. ఈ చిత్రంలో తన నట విశ్వరూపం చూపించింది. యుక్తవయసులో చిరునవ్వుతో ఆనందంగా గడిపిన మణికర్ణిక నుంచి రణరంగంలో కత్తి దూస్తూ రౌద్ర రూపం దాల్చిన లక్ష్మీబాయి వరకు ఆమె జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయో వాటన్నింటినీ కంగనా చూపించగలిగింది. ఈ చిత్రం కంగనా నట జీవితంలో మైలురాయిగా మిగులుతుందనడంలో సందేహం లేదు. లక్ష్మీబాయి భర్త గంగాధర్‌రావు పాత్రలో జిషు సేన్‌గుప్తా, గౌస్‌ఖాన్‌ పాత్రలో డానీ డెంగోజపా, ఝల్కరీబాయి పాత్రలో అంకితా లోఖండే ఇతర నటీనటులు పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.

leave a reply