టీడీపీ నేతలపై ఐటీ దాడులు.. ఏపీ లో మరో కలకలం..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఇది వరకూ ఎన్నడూ లేనట్టు గా నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పార్టీలు డైరెక్ట్ గా పొత్తులు పెట్టుకుంటే కొన్ని పార్టీలు సీక్రెట్ గా పొత్తులు పెట్టుకుంటున్నాయనే చెప్పాలి. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈ విషయం పై క్లారిటీ వస్తుంది. టీడీపీ వైసీపీ అధినేతలు ఇద్దరూ మెరుపు ప్రచారాలు చేస్తున్నారు.. ఒకరి పై ఒకరు నిప్పులు చెరుగుకుంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా రాజాకీయంలోకి నేరుగా వచ్చే దమ్ము లేక జగన్ పట్టానా చెరీ జగన్ ని పావు లా చేసి ఆయన తో మంతనాలు చేయిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలు ఒక పక్కనుంటే మరో పక్క కేసీఆర్ టీడీపీ నేతలనీ బెదిరిస్తున్నారు అని వార్తలు లేకపోలేవు. బాబు ఏమో కేసీఆర్ మోడి లు జగన్ పట్టాన చెరీ ఏపీ రాజకీయం లో జోక్యం చేసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఇక జగన్ ఏమో ఆయన బాబాయి మృతిని అడ్డుపెట్టుకొని బాబు పై విమర్శలు చేస్తున్నారు మొన్నటి వరకు ఐటీ గ్రిడ్స్ పేరిట బాబు పై ఇన్ డైరెక్ట్ గా దాడి చేశారు అనే చెప్పాలి.

ఈ విషయాలు ఇలా ఉంటే తాజాగా రాష్ట్రం లో మరో కలకలం చోటు చేసుకుంటుంది. టీడీపీ నేతలపై పగ పట్టినట్టుగా ఒకేసారి అనేక మంది పై ఐటీ దాడులు నిర్వహించబోతున్నారు. దాదాపుగా 40 మంది టీడీపీ నేతలపై దాడులు నిర్వహించబోతునట్టు సమాచారం వస్తుంది. ఒకవేల అలా జరిగితే అది రాజకీయంగా టీడీపీ ని బలహీన పరచడానికే ఇలాంటి సమయంలో అస్త్రం అవుతుందని చెప్పవచ్చు. ఐటీ దాడి ఆంటీ సెంట్రల్ చేతిలోని పని సెంట్రల్ అంటే మోడి చేతి పనే గా..! మోదీ ఇది వరకు కూడా ఇలా చాలా సార్లు చేయించారు.. రాజ్కీయ నేతల పైనే కాకుండా అనేక మంది న్యాయమూర్తుల పైయన కూడా దాడి చేయించడం మనం చూశాం.. ఇదే తరహాలో ఇప్పుడు టీడీప్పీ ని బలహీన పరిచేందుకు ఐటీ దాడులు చేయించాలని మోదీ ప్లాన్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఇక ఆ నలబై మంది ఎవ్వరూ అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. కానీ త్వరలో దాడి జరగబోతుందని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే మోదీ,కేసీఆర్ లు జగన్ పట్టాన చెరీ ఆయనని గెలిపించాలని చూస్తునట్టే అర్ధం అవుతుంది.

leave a reply