ఇదో రకమైన ట్రెండ్..

అందమంటేనే అమ్మాయిలు.. అమ్మాయిలు అంటేనే అందం.. ఈ రెండింటి బంధం ఏన్నో ఏళ్ల నుంచి ఉన్నది. కాస్త డిఫెరెంట్‌గా స్టైల్‌గా డిజైన్‌ చేసిన డ్రెస్‌ను ఒక అమ్మాయి వేస్తే సరి.. అదే న్యూ ట్రెండ్‌గా ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. పాత తరంలో కొత్తగా.. కొత్త తరంలో పాత స్టైల్స్‌యే ఇప్పుడు సొబగులు హద్దుకుంటున్నాయి. మామూలుగా జీన్స్‌ మీద కాలర్‌ షర్ట్స్‌ లేదా టాప్స్‌ వేసుకునేవారు. కాని ఇప్పుడు దాని మీదది.. దీని మీదది వేరే వాటిపై వేసుకోడమే ట్రెండ్‌. అలా వచ్చిందే ఈ కాలర్‌ షర్ట్‌ లెహంగాలు.

వెస్ట్రన్‌ స్టైల్‌ షర్ట్‌. ఇండియన్‌ ట్రెడిషన్‌ స్టైల్‌ లెహంగాలు. ఈ రెండింటినీ మిక్స్‌ చేస్తే వచ్చిందే ఈ ఇండో వెస్ట్రన్‌ స్టైల్‌. క్యాజువల్‌ వేర్‌గా, వెస్ట్రన్‌ పార్టీవేర్‌గానే కాదు.. సంప్రదాయ వేడుకల్లోనూ ఈ డిఫరెంట్‌స్టైల్‌తో అమ్మాయిలు గ్రాండ్‌గా వెలిగిపోవచ్చు. బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ తారామణులు సైతం ఈ స్టైల్‌కి తెగ ఫిదా అయిపోయారు. సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉండే ఈ లుక్‌కి మించి ఉండదు అంటూ వేదికల మీద తెగ సందడి చేస్తున్నారు.

అలాగే.. డిజైనర్స్‌ మీద ఆధారపడి మనకు నచ్చే కలర్‌ దొరక్క వెయిట్‌ చేసే కంటే ఇలాంటి వాటిని మనమే డిజైన్‌ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫ్యాబ్రిక్‌తో తీసుకుని కుట్టించుకోవచ్చు. మరి ఇంకెదుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి.

leave a reply