తల్లి ఏదీ?… తండ్రి ఏడీ?

 ఈ చిత్రంను హీరో  బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు .

తెలుగు  ప్రజలు ఎంతో  ఆసక్తిగా ఎదురుచూసే ‘యన్ .టి.అర్’  చిత్రంను  జాగర్లమూడి  క్రిష్  దర్శకత్వం  వహిస్తుండగా నందమూరి  బాలకృష్ణ కధానాయకుడిగా  నటిస్తున్నాడు ఈ చిత్రంను హీరో  బాలకృష్ణ ఎంతో  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు .  ఈ సినిమా  ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అనే  టైటిల్స్‌తో రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది.ఈచిత్రం  నుంచి  ఈరోజు (బుధవారం ) రెండో  లిరికల్ పాటను   చిత్ర బృందం  విడుదల చేసింది. “తల్లి ఏదీ?  తండ్రి ఏడీ?  అడ్డుతగిలే బంధమేది?..” అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ముందుగా  విడుదలైన  ‘కధానాయకా…’ పాటకు ప్రజల  దగ్గర నుంచి  మంచి  స్పందన వస్తుంది.

ఏ చిత్రంలో  ప్రధాన పాత్రలైనా నారాచంద్రబాబునాయుడు గారి  పాత్రలో  రానా నటిస్తుండగా, స్వర్గీయ  నందమూరి  హరికృష్ణ గారి  పాత్రలో అయన  కుమారుడు నందమూరి  కళ్యాణ్ రామ్, స్వర్గీయ  అక్కినేని  నాగేశ్వర  రావు గారి పాత్రలో సుమంత్   నటిస్తున్నాడు.ఈచిత్రంలోని  మిగిలిన పాటలను కూడా ఈనెలాఖరుకు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ చిత్రానికి   ఎం.ఎం కీర‌వాణి స్సంగీతం  అందిస్తున్నారు.

leave a reply