మావయ్య చెప్పగానే….

తిత్లీ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలో  శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.అదే సమయంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిత్లీ ప్రభావిత ప్రాంతాల్ని పర్యటించి అక్కడున్న వారికి కావాల్సిన కనీస సౌకర్యాల గురించి ఆరా తీశారు. అంతేకాకుండా వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ప్రతీ ఒక్కర్ని అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు  సినీ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సహాయ గుణాన్ని చాటుకున్నారు. ఇప్పటికే రూ. 25లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కు ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తన సేవాగుణాన్ని చాటుకున్నారు.

మండస, వజ్రకొట్టూరు మండలాల్లోని.. కొండలోగం, దేవునలతడ, అమలపాడు, పొల్లాడి గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకుగాను 3 ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) వాటర్ ప్లాంట్స్, ఒక బోర్ వెల్ వేయించేందుకు అయన  ముందుకు వచ్చారు. సాధ్యమైనంత త్వరగా  ఆయా గ్రామాల్లోని దాదాపు 3000 మందికి పైగా  సురక్షిత మంచి నీరుని అందించడానికి చూస్తున్నారు. అయితే ఈ  ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధులతో భాదపడుతుండంతో పరీక్షలు నిర్వహించిన  అనంతరం  ఈ వాటర్ ప్లాంట్స్, బోర్ వెల్ ఏర్పాటు చేయనున్నారు.

leave a reply