తిరుమలకు రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం తిరుపతి రానున్నారు.అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు.‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’లో భాగంగా నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గత ఎన్నికల సమయంలో మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చి ఎలా ఆంధ్రా ప్రజలను మోసం చేసారో వివరిస్తూ సభావేదిక పైనుంచే ప్రత్యేక హోదాపై రాహుల్‌ భరోసా ఇవ్వనున్నారు.

leave a reply