తేనెతో ప్రయోజనం తక్కువేనట!

తేనెను తీసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అంతకు మించి పోషకాలు కూడా దాగి ఉన్నాయనేది ఒక నమ్మకం. అంతేకాకుండా ఊబకాయం వస్తుందనే భయంతో చక్కెరకు బదులు తేనె ఉపయోగించే వారు ఎక్కువగా ఉంటారు. కొంతమంది బరువు తగ్గడం కోసం కూడా ఉపయోగిస్తారు. అయితే తేనెను ఉపయోగించడం వల్ల  అనుకున్నంత ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు. చక్కెర కంటే తియ్యగా ఉంటుంది అనే ఒక్క సుగుణం తప్ప, తేనెలో చెప్పుకోదగ్గ  పోషక విలువలు లేవని పరిశోధకులు వెల్లడించారు.

తేనెలో కాలరీలు ఎక్కువగా ఉన్నా బాక్టీరియా విషయానికొస్తే, తేనె అన్నిబాక్టీరియాలను అంతమొందించలేదని కేవలం రెండు రకాల బాక్టీరియాలు మాత్రమే తేనెకు లొంగుతాయని తెలిపారు.  ఇటీవలి కాలంలో శాస్త్రీయ పరిశోధనల్లో దీన్ని ‘లిక్విడ్ గోల్డ్’గా అభివర్ణిస్తూ డెమెన్షియా, ఇన్‌ఫెర్టిలిటీ లాంటి పెద్ద సమస్యలకు ఔషధంగా కనుగొన్నారు. తేనెను ఉపయోగించే మహిళల జ్ఞాపకశక్తి స్వల్పంగా మెరుగుపడవచ్చన్న విషయంతో గతంలో నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. తేనెలో సహజంగా వుండే యాంటీఆక్సిడెంట్స్ మూలంగా గర్భంలో వుండే పిండానికి ప్రమాదం కలగకుండా కాపాడే అవకాశం వుంది. అంతేగాని తేనె సర్వరోగ నివారిణి కాదని తెలిపారు.

leave a reply