ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి

ద్వారాకా తిరుమల దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటారు. ద్వారాకా తిరుమల పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరుకు 42కి.మీలో కలదు. కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామి వారి విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇలా ఉండటం కూడా చాలా అరుదు.

చరిత్ర ప్రకారం.. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు.

ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు ఏమనగా.. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వారందరూ తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. విశేష ఉత్సవాలు, ఉగాది శ్రవణ పంచాంగం, తిరుకళ్యాణోత్సవాలు, శ్రీసీతారాము కల్యాణం, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణ మొదలగు పూజలన్నీ స్వామివారికి నిర్వహిస్తారు.

leave a reply