ధోనీ ఉన్నప్పుడు…క్రీజు వదలొద్దు!

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ధోని తన సమయస్ఫూర్తితో నీషమ్‌ను తెలివిగా రనౌట్‌ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ను సలహా ఇచ్చింది. “ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు ఆటగాళ్లు క్రీజు వదలొద్దు” అంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. జాదవ్ బౌలింగ్ చేసిన ఒక ఓవర్లో బంతి నేరుగావచ్చి నీషమ్‌ ప్యాడ్స్‌ కు తగలడంతో టీమిండియా అంపైర్ కు అప్పీల్ చేసింది… ఇదే సమయంలో ధోని చాకచక్యంగా నీషమ్ ని రన్ అవుట్ చేసాడు. ఆ రనౌటే మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ లో హుల్ చల్ చేస్తుంది.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఐసీసీని స్పందించాలని కోరగా. దీనికి ఐసీసీ స్పందిస్తూ… “స్టంప్స్‌ వెనుక ధోని ఉన్నప్పుడు ఎప్పుడూ క్రీజ్‌ను వీడొద్దు” అంటూ ట్వీట్‌ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియాకు న్యూజిలాండ్ తో మూడు  టీ20ల సిరీస్‌లు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి.

leave a reply