నాకు సిల్లీగా అనిపించింది!

శిఖర్‌ పహారియా అనే యువకుడితో శ్రీదేవి కూతురు జాన్వి డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు షికారు చేస్తున్నాయి. కాని అందులో ఏ మాత్రం నిజం లేదని చెబుతుంది జాన్వీ. శిఖర్‌ తనకు ఒక గుడ్‌ ఫ్రెండ్‌ మాత్రమేనని అంటుంది. తనపై వచ్చిన డేటింగ్ వార్తల గురించి తన పేరెంట్స్‌ ఎక్కువగా ఊహించేసుకున్నారని జాన్వి కపూర్‌ చెప్తుంది. శిఖర్‌ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మనవడు. వీరిద్దరూ కలిసి దిగిన వ్యక్తిగత ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అయితే ఈ విషయం జాన్వి తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్‌కు తెలియడంతో వారు కాస్త సీరియస్‌ అయ్యారట.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ.. ‘నా గురించి వచ్చిన డేటింగ్‌ వార్తల గురించి అమ్మ, నాన్న కాస్త సీరియస్‌ అయ్యారు. ఎక్కువగా ఊహించేసుకున్నారు. ఎవరైనా నచ్చితే చెప్పు పెళ్లిచేస్తామన్నారు. నాకు అది చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ప్రేమించడం వేరు, ఇష్టపడటంవేరు కదా.. ఇష్టపడిన ప్రతి ఒక్కరినీ పెళ్లిచేసుకోలేం కదా? ఇదే మాటను అమ్మకు చెప్పాను. కానీ అమ్మకు నా లాజిక్‌ అర్థంకాలేదు.’ అని తెలిపింది.

ఈమధ్య జాన్వీ ఇంటర్య్వూస్‌ అన్నీ వైరల్‌ అవుతూనే ఉంటున్నాయి. ఇంతకుముందు ఇలా పొట్టిజుట్టులో నాన్న చంపేస్తాడంటూ.. ఇప్పుడు తన పెళ్లి గురించి అంటూ చెప్తుంది. ఇవన్నీ తెలిసి చెప్తుందా.. లేదా ఈ రకంగా ఫేమ్‌ అవుదామని చెప్తుందో కాని.. జాన్వీ కొంచెం ఆలోచించి మాట్లాడితే మాత్రం మంచిది.

కాగా.. ‘ధడక్‌’ చిత్రంతో మంచి విజయం అందుకున్న జాన్వి ప్రస్తుతం ఐఏఎఫ్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ తెరకెక్కించనున్న ‘తఖ్త్’ చిత్రంలోనూ నటించనున్నారు.

leave a reply