నా మద్దతు ‘క్రిష్‌’కే

డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ సినిమాకు దర్వకత్వం వహించిన విషయం విదితమే. కాగా.. ఈ సినిమా ఎన్నో వివాదాలను ఎదుర్కొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్స్‌లో రన్‌ అవుతుంది. అయితే.. హీరోయిన్‌ కంగనా, డైరెక్టర్‌ క్రిష్‌ల మధ్య కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమా నుంచి క్రిష్‌ తప్పుకున్న విషయం కూడా తెల్సిందే.. తాజాగా ఈ సినిమాపై ఆయన స్పందించి ‘కంగనాకు ఎలా నిద్రపడుతుంతో తెలీటంలేదు.. నా కష్టాన్ని తన కష్టంగా చెప్పుకుంటుంది’ అని కామెంట్‌ చేశారు. కాగా.. దీనిపై కంగానా రౌనౌత్‌ సోదరి రంగోలి ‘క్రిష్‌ జీ నాకు తెలుసు ఈ కష్టమంతా మీదే.. కానీ ప్రస్తుతం ఈ విజయాన్ని కంగనాను ఎంజాయ్‌ చేయనివ్వండి అంటూ’ వెటకారంగా రీ కౌంటర్‌ ఇచ్చారు. అయితే.. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్‌ నటి, నిర్మాత మహేశ్‌ భట్‌ కుమార్తె పూజా భట్‌ స్పందించారు.

డైరెక్టర్‌ క్రిష్‌కి నేను నా మద్దతు తెలుపుతున్నా.. ఆయన విషయంలో జరిగింది చాలా తప్పని ఆమె అన్నారు. నేను చూడాలనుకుంటున్న చిత్ర పరిశ్రమ ఇది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీకి ఓ రెస్పెక్ట్‌ ఉంది. సినిమాను తెరకెక్కించే విషయంలో మాత్రం మొదటి ప్రాధాన్యత దానిని తీసే వ్యక్తిని గుర్తించడమేనని పేర్కొన్నారు పూజ. ప్రేక్షకుల నాడి దర్శకుడికే బాగా తెలుస్తుంది. సెట్‌లో వారు చెప్పినట్లు నడుచుకోవాలి కానీ ఇలా వివాదాలు తెచ్చుకోకూడదంటూ  పూజ భట్‌ అన్నారు.

leave a reply