నా సినిమా పోస్టర్‌పై పేడ కొట్టారు

సినిమా అనేది ఒకరితో ముడిపడేది కాదని అందరి భాగస్వామ్యంతోనే సినిమా విజయం సాధ్యమవుతుందన్నారు నట కిరీటి రాజేంద్రప్రసాద్‌. తెలుగు సినిమా పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో పలువురు డైరెక్టర్స్‌, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. విజయవాడలో వేసిన నా మొదటి సినిమా పోస్టర్‌పై పేడ కొట్టారు. ఈ సంఘటన నేను మరవలేనిదని, అయినా నేను బాధపడలేదని అప్పుడే నా ఎదుగుదల మొదలైందని అన్నారు. నా వల్లే సినిమాలు ఆడుతున్నాయని చెప్పేంత స్వార్థం తనకు లేదని అన్నారు. జీవితాంతం ప్రేక్షకులకు నవ్వించేందుకు ఉంటానని తెలిపారు రాజేంద్రప్రసాద్‌.

leave a reply