నిషేధం ఎత్తివేతపై…భిన్నాభిప్రాయాలు!

కాఫీ విత్ కరన్ షోలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు యువ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్యాలపై విధించిన నిరవధిక నిషేధాన్ని ఎత్తివేయడంతో టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య న్యూజిలాండ్‌ బయల్దేరాడు. గత కొంత కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కేఎల్‌ రాహుల్‌ భారత్‌-ఏ తరఫున ఆడనున్నాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో ఈ జట్టు తలపడనుంది. అయితే ఈ నిర్ణయంపై భారత అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారు తగిన శిక్ష అనుభవించారని కొంతమంది భావిస్తుండగా, మరికొందరు వారికీ శిక్ష తొందరగా ఎందుకు ఎత్తివేసారని అంటున్నారు. 

ప్రస్తుత జట్టు సభ్యుల ఆటతీరు ప్రశంశనీయంగా ఉందని ఇలాతప్పు వాళ్ళ అవసరం జట్టుకు లేదంటున్నారు. బీసీసీఐ కేసులో సుప్రీం కోర్టు నియమించిన కొత్త అమికస్ ‌క్యూరీ పీఎస్‌ నరసింహను సంప్రదించిన తర్వాత పాలకుల కమిటీ పాండ్య, రాహుల్‌పై గురువారం సస్పెన్షన్‌ ఎత్తివేసింది.  బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సైతం విచారణ కొనసాగిస్తూనే రాహుల్, పాండ్యాలపై నిషేధాన్ని తొలగించాలని కోరారు. ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య లేకపోవడంతో జట్టు కూర్పు సమస్యగా మారిందని, టీ

leave a reply