నెటిజన్లను షాక్‌కు గురి చేసిన ఆదా..!

హీరోయిన్‌ ఆదాశర్మ ఒక్కసారిగా నెటిజన్లను ఆశ్యచర్యపరిచారు. సంప్రదాయ క్రీడైన మల్లకంబను తాడు సహాయంతో చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మల్లకంబ ఒలింపిక్‌ క్రీడల్లో ఒకటి కాబోతోందని, ఫిబ్రవరి 16, 17న ముంబాయిలో శివాజీపార్కు వద్ద ఛాంపియన్‌ పోటీలు జరగబోతున్నాయని ట్వీట్‌ చేశారు. కానీ.. అందులో ఆదా పాల్గొంటున్నారా.. లేదా అనే విషయం మాత్రం తెలుపలేదు. ఈ వీడియోలో మల్లకంబ చేస్తున్న ఆదాను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నటిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘వావ్ ఇదెలా సాధ్యం, నమ్మలేకపోతున్నాం, నువ్వు అద్భుతం, బాగా చేశావు.. కాకపోతే కాస్త రిస్కుతో కూడుకున్నది, ఇదెంతో ప్రత్యేకమైంది, మీలో చాలా కళలు ఉన్నాయి, మైండ్‌బ్లోయింగ్‌..’ అంటూ కామెంట్లు చేశారు.

leave a reply