‘నేను చేసుకోను’ డాడీ

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పాటు ఆయన ముద్దుల కూతురు గారాల పట్టి అర్హా సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. అర్హకు నాలుగేళ్లే అయినా అల్లు అర్జున్‌ అప్పుడే పెళ్లి సంబంధం గురించి మాట్లాడేస్తున్నారు. ఏంటా అనుకుంటున్నారా..! నిజమే తన కూతురు అర్హను అల్లు అర్జున్‌ ‘నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో’ అంటే..  తనేమో ‘నేను చేసుకోనంటూ’ ముద్దు ముద్దుగా సమాధానమిస్తుంది. బన్నీ ఎన్ని సార్లు అడిగినా కూడా అర్హ అదే సమాధానమిస్తుంది. తాజాగా.. అల్లు అర్జున్‌ అర్హతో ఓ ఫన్నీ వీడియోను చేశారు. కాగా..ఈ వీడియాను అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి నెటిజన్లు ఎగ్జైట్‌ అవుతూ అర్హ ముద్దు ముద్దు మాటలకు నవ్వుకుంటున్నారు.

leave a reply