పడి పడి…లేవని మనసు!

శర్వానంద్ సాయి పల్లవి కలసి నటించిన చిత్రం పడి పడి లేచె మనసు. ఈ సినిమా డిసెంబర్ 21(శుక్రవారం )ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విషయానికి వస్తే … కోల్ కతాలో చదువు పూర్తి చేసి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తున్న సూర్య (శర్వానంద్).. అనుకోకుండా మెడికో అయిన వైశాలి (సాయిపల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె వెంట పడి పడి.. చివరికి ఆమెను కూడా ప్రేమలోకి దించుతాడు. ఐతే తన తల్లిదండ్రుల జీవితంలో జరిగిన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని అతను వైశాలితో పెళ్లికి నిరాకరిస్తాడు. ఒకరినొకరు విడిచి ఉండిపోలేనంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఆ స్థితిలో సూర్య.. వైశాలి ఒక ఏడాది పాటు ఒకరికొకరు దూరంగా ఉండాలనే ఒప్పందానికి వస్తారు. మరి ఏడాదిలో ఏం జరిగింది.. తిరిగి వీళ్లిద్దరూ ఏడాది తర్వాత కలిశారా.. ఆపై కలిసి జీవితాన్ని పంచుకున్నారా లేదా అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

హను రాఘవపూడిమంచి అభిరుచి ఉన్న దర్శకుడు. అతడికి మంచి ఆలోచనలుంటాయి. భిన్నమైన కథలుప్రయత్నిస్తాడు. ప్రేమ సన్నివేశాల్ని పండించడంలో అతడి శైలే వేరు. ప్రేమ వ్యవహారంరొటీనే అయినా.. ప్రేమ సన్నివేశాల్ని పండించడంలో హను అభిరుచి.. ట్రీట్ మెంట్ లోఉండే ఫ్రెష్ నెస్.. శర్వానంద్-సాయిపల్లవిల పెర్ఫామెన్స్.. వాళ్ల మధ్య కెమిస్ట్రీఅన్నీ చక్కగా కుదిరి ‘పడి పడి లేచెమనసు’ ఒక దశ వరకుచక్కగా.. ఆహ్లాదకరంగా సాగిపోతుంది. కానీ ద్వితీయార్ధంలో దర్శకుడిగా అతడి ముద్రేమీకనిపించదు. స్క్రీన్ ప్లేనే చాలా గందరగోళంగా తయారైంది. అతడి చేతుల్లోంచి సినిమాజారిపోయింది. కొన్నిసన్నివేశాలు అసంబద్ధంగా ఉన్నప్పటికీ శర్వా-పల్లవి జోడీ వాటిని కప్పి పుచ్చుతుంది. భిన్నంగా అనిపించే కోల్ కతా నేపథ్యం.. కంటికింపైన విజువల్స్.. వీనుల విందైన సంగీతంకూడా తోడై ప్రథమార్ధం ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది.

రేటింగ్:   2.5/5

leave a reply