పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వాయుసేన మెరుపు దాడులు

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్‌ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై వెయ్యికిలోల బాంబులతో విరుచుకుపడ్డాయి. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం.

జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్ర శిబిరాల్లో బాలాకోట్‌ శిబిరం చాలా పెద్దది.ఇక్కడ దాడి జరిగిందంటే మృతుల సంఖ్యే ఎక్కువే ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.కేవలం నిమిషాల వ్యవధిలో లక్ష్యాలను ఛేదించి ఐఏఎఫ్ తన సత్తా చాటుకుంది. పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు తేరుకునేలోపే ఐఏఎఫ్ యుద్ధ విమానాలు పనిముగించుకుని తిరిగి వచ్చాయి.

leave a reply