పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు -కేసీఆర్‌

ఢిల్లీ పర్యటన ముగించుకున్న అనంతరం హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. వాడుకొని వదిలిపెట్టడంలో చంద్రబాబు దేశంలో నెం1 అని వ్యాఖ్యనించారు. చంద్రబాబు లీడర్ కాదు.. మానేజర్‌ అన్నారు. చంద్రబాబు ఐటీకి చేసిందేమీ లేదు.. దొచుకున్నదే తప్ప అన్ని అన్నారు. హైదరాబాద్‌ అన్ని విధాల అనుకూలంగా ఉంది కాబట్టే ఇక్కడ ఐటీ అభివృద్ది చెందిందన్నారు.

స్వామీజీ ఆహ్వానం మేరకు రాజశ్యామల అమ్మ వారి దేవాలయం ఇంకెక్కడా లేదు కాబట్టి..అందుకే శారదా పీఠం వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నా అన్నారు. రిటర్న్ గిఫ్ట్ పంపిస్తా ..రెడీ గా ఉండు.. ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోబోతుంది. చంద్రబాబు స్వార్దానికి హరికృష్ణ కూతురు బలైందన్నారు.

అలాగే.. మా పార్టీ లోక్ సభ, రాజ్యసభలోనూ ఫ్లోర్ లీడర్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని సభలో చెప్పారు.. అవసరమైతే ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వమని నేనే ప్రధానమంత్రికి లేఖ రాస్తా.. ఏపీకి లోటు బడ్జెట్ ను కేంద్రం ఇస్తుంది.. చంద్రబాబు పాలనలో విపరీత కరప్షన్ ఉంది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు మేలోనే హైకోర్టును డిసెంబర్ వరకు బదలాయిస్తామని అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు ఇచ్చింది.. డిసెంబర్‌లోపే వెళ్ళిపోతామన్నొళ్ళు.. అక్కడ ఏంధుకు కోర్టును రెడీ చేయలేదేంటని ప్రశ్నించారు. మీ దగ్గర తప్పు పెట్టుకొను కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాడు. చంద్రబాబును బరిస్తున్నంధుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోక్కాలి.. పిచ్చి మాటలు మాట్లాడి, అసత్య ఆరోపణలు చేస్తె ఏలాంటి ఫలితాలు వస్తాయో.. ఈ ఎన్నికలు చూస్తే అర్థమవుతుంది.. కదా.. ప్రజా జీవితంలో ఏది పడితె అది మాట్లాడితే ప్రజలు ఓప్పుకోరు అని కేసీఆర్‌ అన్నారు.

leave a reply