పీడ కలలతో జాగ్రత్త!

చాలా మందికి నిద్రపోయే సమయంలో రకరకాల కలలు వస్తుంటాయి. అయితే ఈ కలలలో సాధారణ కలలు వస్తుంటాయి అలాగే పీడ కలలు వస్తుంటాయి. సాధారణ కలల వల్ల వచ్చే నష్టం ఏమి లేదు గాని, పీడా కలల వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు. నిత్యం పీడకలలు రావడం వాటి వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది.  అయితే ఈ పీడ కలల వల్ల  భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు. పీడ కలలతో బాధపడే వారు ఆందోళన, తీవ్ర ఒత్తిడి, గురికావచ్చని పరిశోధకులు తెలిపారు.

నిద్రలో వచ్చే పీడ కలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వీటి వల్ల కళ్లు మూసి నిద్రించడానికి కాస్త జంకుతారు. ఇది క్రమేనా నిద్రలేమికి దారితీస్తుంది. ఇటీవల ఓ సంస్థ కొంతమంది పెద్దలపై నిర్వహించిన పరిశోధనలో చాలామంది పీడ కలలతో బాధపడుతున్నారని, వారిని ఏదో చెడు శక్తి తరుముతున్న భావనతో బాధపడుతుంటారని తేలింది.

ఈ పీడకలలు నిత్యం వెంటాడుతుంటే అవి అనారోగ్యానికి సంకేతాలని భావించాలని పరిశోధకులు తెలుపుతున్నారు. పెద్దల్లో సుమారు 2 నుంచి 8 శాతం మంది ఈ సమస్యతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలియచేసారు. ఈ సమస్య అధికంగా ఉన్నవారు వీలైతే మానసిక నిపుణులను సంప్రదిస్తే మంచిదని తెలిపారు.

leave a reply