పూరీ, చార్మీల మధ్య గొడవ పెట్టిన హీరో

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌కి యంగ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. సాధారణంగా సినిమాలు హిట్‌ అయితే డైరెక్టర్‌కి హీరో గిఫ్ట్‌లు ఇవ్వడం ఇఫ్పుడు కామన్‌ అయిపోయింది. అయితే.. వాటికి భిన్నంగా సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఆ డైరెక్టర్‌కి గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు యంగ్ హీరో రామ్‌.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే హీరో రామ్.. ప్రపంచంలోనే ఖరీదైన ఓ కాఫీ ప్యాకెట్‌ని డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుపుతూ పూరి ట్వీట్ చేశాడు. దీని పేరు కోపీ లువాక్ అని, దీని గురించి గూగుల్‌లో వెతకండి అని పేర్కొన్నాడు. అయితే పూరి చేసిన ఈ ట్వీట్ చూసి ‘షిట్ షిట్ షిట్’ అని ఛార్మి కామెంట్ చేసింది.

leave a reply