పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన హీరోయిన్‌

పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన హీరోయిన్‌ సాయి పల్లవి. తాజాగా.. జరిగిన ఓ ఇంటర్య్వూలో అడిగిన ప్రశ్నకు షాకింగ్‌ సమాధానమిచ్చింది. ‘నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నా తల్లిదండ్రులతోనే ఉండిపోవాలని ఉంది. నేను పెళ్లి చేసుకుంటే వాళ్ల బాగోగులు చూసుకోలేను’ అంటూ సమాధానమిచ్చింది. అందుకే.. నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా అని అనడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్‌ కావడంతో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ఇందులో సాయి పల్లవి నక్సలైట్‌ పాత్రలో, హీరో రానా పోలీసు పాత్రలో కనిపించబోతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు.

leave a reply