పొత్తుపై ఎటు తేల్చని విజయకాంత్

తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందా లేదా అనేది ఇంకా అధికారికంగా దృవీకరించలేదు. ప్రధాని మంత్రి మోడీ తమిళనాడు రాక సందర్భంగా పన్నీర్‌సెల్వం ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తమ కూటమిలో డీఎండీకే చేరుతోందని చెప్పారు.కానీ విజయ్‌కాంత్ బావమరిది ఇంకా మాత్రం చర్చలు జరుగుతున్నాయి అని ప్రకటించటంతో అసలు పొత్తుల విషయంలో ఏమి జరుగుతుందని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.

అన్నాడీఎంకే-బీజేపీ కూటమి పొత్తులో భాగంగా 4 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు అన్నాడీఎంకే సుముఖంగా ఉందని చెబుతున్నారు.కానీ డీఎండీకే 7 సీట్లు కేటాయించాలని గట్టిగా అడుగుతున్నట్టు తెలుస్తోంది, మరియు ఒక రాజ్యసభ సీటు కూడా ఉంది. డీఎంకే-కాంగ్రెస్‌ కూటమితో కూడా డీఎండీకే పొత్తు మంతనాలు సాగించిందని, అయితే తమ కూటమిలో మిత్ర పక్షాలు ఎక్కువగా ఉన్నందువలన 4 సీట్లు మాత్రమే ఇవ్వగలమని డీఎంకే చెప్పినట్లు సమాచారం. చివరిగా డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఎటు వైపు మొగ్గుతారో కాలమే నిర్ణయించాలి.

leave a reply